బిగ్‌బీకి దాదా సాహెబ్ ఫాల్కే

బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్ భారత చలన చిత్ర సీమలో గౌరవప్రదమైన, అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది. అవార్డు అందకుంటున్న సమయంలో ఆయన వెంట భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. కాగా.. అమితాబ్ మాట్లాడుతూ.. అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.