చంద్రబాబు ఉత్తరాంధ్ర టూర్ క్యాన్సిల్

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను రద్దు చేసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 2, 3 తేదీల్లో ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించానలి భావించారు. అయితే అదే సమయంలో జీఎన్ రావు కమిటీ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని ప్రతిపాదించారు. దీనిని నిరసిస్తూ అమరావతిలో ప్రజలు రోడ్లపైకి ఎక్కగా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు అమరావతిలో రైతులకు మద్ధతుగా నిరసనలో పాల్గొనడాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని కొందరు టీడీపీ నేతలు జీర్ణించలేకపోతున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడంతో అక్కడి ప్రజల్లో ఆయన పట్ల గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో పర్యటనకు రావడం మంచిది కాదని కొందరు అధినేత దృష్టికి తీసుకొచ్చారని అందువల్లే బాబు చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. విశాఖలో రాజధాని ఏర్పాటుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బాలకృష్ణ అల్లుడు భరత్, కొండ్రు మురళి వంటివారు సమర్థిస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు. ఈ కారణాలతో పాటు మరికొన్ని అంశాలు బాబు పర్యటన వాయిదా పడేలా చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి అసలు మ్యాటర్ తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.