మా లో భగ్గుమన్న విభేదాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నరేష్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి సభ్యుల మధ్య ఏదొక గొడవ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా పార్క్ హయత్‌లో మా డైరీ కార్యక్రమం జరుగుతుండగా.. చిరంజీవి, రాజశేఖర్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ పలు సూచనలు ఇస్తున్న సమయంలో రాజశేఖర్ ఆయనకు అడ్డుపడటమే కాకుండా మైకు లాక్కోవడం జరిగింది. మా కోసం తాను ఇంతవరకు ఒక్క సినిమా కూడా చెయ్యలేదని రాజశేఖర్ తెలిపారు. అంతేకాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కారణంగా తన ఇంట్లో గొడవలు జరిగాయన్నారు. అటు తన ప్రమాదం జరగడానికి కూడా ఇదే కారణమన్నారు. వేదికపై ఉన్న ప్రముఖులందరికి కాళ్లు మొక్కిన ఆయన.. నిప్పు రాజుకున్నది.. కప్పిపుచ్చినా అది బయటికి రాకుండా ఉండదని స్పష్టం చేశారు. అసోసియేషన్‌లో 8 మంది ఒకవైపు.. 18 మంది ఒకవైపు ఉన్నారని.. ఎంత మంచి చేసినా తమను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు