రెమ్యూనరేషన్ పెంచాలి :విజయసాయి

ఏపీలో రాజధాని వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా పవన్ డిసెంబర్ 31న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. దీంతో పవన్‌ను…టీడీపీ వెనకనుంచి నడిపిస్తుందంటూ ఫైరయ్యారు విజయసాయి. పెయిట్ ఆర్టిస్ట్ అంటూ ఘాటు పదజాలం ఉపయోగించారు. పవన్ కళ్యాణ్ నటనా కౌశల్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అమరావతి రైతుల ముందు ఈ పారితోషక నటుడి ప్రదర్శన చూశాక, తెలుగుదేశం అధినాయకత్వం నుంచి రెమ్యునరేషన్‌ను మరింత పెంచుకునేందుకు అర్హుడని నేను భావిస్తున్నాను అని ట్వీట్ చేశారు.