రాజధాని కోసం రక్తం చిందిన తెలుగుదేశం ఎమ్మెల్యే

అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులో కుటుంబ సభ్యులతో నిరాహారదీక్షను చేప్టటారు. రక్తాన్ని చిందించి అయినా అమరావతిని కాపాడుకుంటాం అంటూ రక్తంతో ప్లకార్డులపై వేలి ముద్రలు వేశారు. మరోవైపు విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ సైతం సేవ్ ఏపీ..సేవ్ అమరావతి పేరుతో 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు.ఈ నిరసన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరై, మద్దతు ప్రకటించారు.