నారా లోకేష్ అరెస్ట్

విజయవాడలో నారా లోకేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదానికి దిగ్భందనానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో నారా లోకేష్ చినకాకానికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే లోకేష్‌ని అరెస్ట్ చేశారు. బెంచ్‌ సర్కిల్‌ సమీపంలో ఆయన్ని అరెస్ట్ చేసి యనమల కుదురు పీఎస్‌కి తరలించారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లోకేష్ అరెస్ట్‌ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అమరావతిలో ఆందోళనలు మరింత ఉదృత రూపం దాల్చాయి. రాజధాని రైతులతోపాటుగా పలు పార్టీల నేతలు రోడ్లపైకి ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక కోటగుమ్మం సెంటర్‌ నుంచి డిలాక్స్‌ సెంటర్‌ వకు నిరసన ర్యాలీ కొనసాగింది. టీడీపీ, జనసేన న్యాయవాదులు, వివిధ రాజకీయ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

దీంతో.. అక్కడ పరిస్థితి రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో.. టీడీపీ నేత నారా లోకేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.