కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తే పెట్రోలు మరింత చౌక.

భారత దేశంలో రోజురోజుకు  పెట్రోలు, డిజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి పెనుభారంగా మారాయి. ఇంధన ధరలు  పైసల్లో పెరిగినా.. వాహనాదారుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. ముఖ్యంగా భారతదేశం ముడి చమురును 80 శాతం దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు దిగుమతిలో భారతదేశం చాలా విదేశీ మారకద్రవ్యం ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ముడి చమురు ధర రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర.  రెండోది అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా భారత రూపాయి స్థానాన్ని బట్టి   భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది.

 ముడి చమురును భారీగా దిగుమతి చేసుకునేందుకు భారత్,   విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో  మిథనాల్ మిళితమైన ఇంధనాన్ని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని చేయడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమైతే  అది చారిత్రాత్మకంగా పెట్రోల్ ధరను తగ్గించినట్లవుతుంది. మిథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని తయారైన  లీటరు పెట్రోల్ ధరను నేరుగా లీటరుకు 10 రూపాయలు తగ్గించగలదు. మార్కెట్లో మిథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల  భారతదేశం ముడి చమురు దిగుమతిని కూడా తగ్గించాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల భారీ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుంది.

ప్రస్తుతం దేశంలో 10 శాతం ఇథనాల్-బ్లెండెడ్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం  ఇథనాల్ ధర లీటరుకు సుమారు రూ.42 గా ఉంది. ఇది మిథనాల్ కన్నా చాలా ఖరీదైనది.  ఎందుకంటే మిథనాల్ మిశ్రమ ఇంధనం ధర ప్రస్తుతం లీటరుకు రూ.20గా ఉంది.  ఇండియన్ ఆయిల్ ఇప్పటికే 15 శాతం మిథనాల్, 85 శాతం పెట్రోల్ కలిగి ఉన్న మిథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీథేన్‌లో 15 శాతం ఇంధనంలో కలిపితే.. 2030 నాటికి దేశానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేస్తుంది.

 ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. భారతదేశం యేటా 114.5 బిలియన్ డాలర్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం 2,900 కోట్ల లీటర్ల పెట్రోల్, 9,000 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తుంది.  ప్రస్తుతం  రోజుకు 100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న అస్సాం పెట్రోకెమికల్స్లో మిథనాల్ తయారవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2020 నాటికి ఈ ఉత్పత్తి రోజుకు 6 రెట్లు పెరిగి 600 టన్నులకు పెరుగుతుందని అంచనా. దేశంలో వీలైనంత త్వరగా మిథనాల్ బ్లెండెడ్ ఇంధనం లభిస్తే  అది పెట్రోల్ ధరను లీటరుకు కనీసం 10 రూపాయలు తగ్గి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో అభివృద్ధి పనులకు ఉపయోగపడే భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాలను ఆదా చేస్తుంది.`నా పేరు  రాజా` టీజ‌ర్ లాంచ్‌!!


 అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్  హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `నా పేరు రాజా`. రాజ్ సూరియ‌న్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మాత‌లు.  తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం  టీజ‌ర్ లాంచ్  కార్య‌క్ర‌మం  ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది. ఈ సందర్భంగాహీరో రాజ్ సూరియ‌న్ మాట్లాడుతూ...``నేను హీరోగా తిరుగుబోతు, జ‌టాయువు సినిమాలు చేసాను. `నా పేరు రాజా` నా మూడో సినిమా. ఇది తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందిస్తున్నాం. ద‌ర్శ‌కుడు అశ్విన్ అద్బుత‌మైన క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో రొమాంటిక్, యాక్షన్ , లవర్ బాయ్ ఇలా త్రి షేడ్స్ తో నా క్యారెక్టర్ ఉంటుంది.  ఇప్పటికే కన్నడ లో సెన్సార్ కంప్లీట్ అయ్యింది. కానీ తెలుగు లో మాత్రం సెన్సార్ ఇవ్వడానికి ఎందుకో  లేట్ చేస్తున్నారు.  సీరియల్ ప్రకారం చేయకుండా వెనక వచ్చిన పెద్ద సినిమాలకు సెన్సార్ ఇస్తున్నారు. ఎమన్నా అంటే ఇక్కడ పద్దతి మీకు తెలియదంటున్నారు. ఇదేమీ పద్ధతో నాకు తెలియడం లేదు. అనుకున్న ప్రకారం సెన్సార్ కంప్లీట్ అయితే జనవరి 31న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేస్తాం`` అన్నారు . నిర్మాత ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ...`` నిర్మాత‌గా ఇది నా మూడో సినిమా.  మ‌నాలి, హైద‌రాబాద్, కేర‌ళ లో షూటింగ్ పూర్తి  చేసాం. ఇందులో ల‌వ్, కామెడీ, యాక్ష‌న్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన కమర్షియల్  అంశాల‌న్నీ మెండుగా ఉన్నాయి.  ఇటీవల రిలీజ్ చేసిన లిరికల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను జవవరి 31న రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్

మాట్లాడుతూ...``డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను డైర‌క్ట‌ర్ ప్ర‌తి సీన్ అద్బుతంగా తీసాడు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా అన్ని విధాల స‌హ‌క‌రించారు`` అన్నారు. హీరోయిన్ నస్రీన్  మాట్లాడుతూ...`` ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో హాట్ రోల్ చేశాను`` అన్నారు. మరో హీరోయిన్ ఆకర్షిక మాట్లాడుతూ...``ఇప్పటికే రిలీజ్ అయినా లిరికల్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా`అన్నారు. ద‌ర్శ‌కుడు అశ్విన్ కృష్ణ‌ మాట్లాడుతూ...``డైర‌క్ట‌ర్ గా ఇది నా తొలి సినిమా. ఉపేంద్ర , ముర‌ళీమోహ‌న్ గార్ల వంటి  పెద్ద డైర‌క్ట‌ర్స్ వ‌ద్ద నేను ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో గత 20 ఏళ్లుగా ప‌ని చేస్తున్నా. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్. హీరో క్యార‌క్ట‌ర్ లో త్రీ షేడ్స్  ఉంటాయి. అవి ఏంట‌నేవి స్క్రీన్ పైనే చూడాలి. అలాగే ఇద్ద‌రు హీరోయిన్స్ పాత్ర‌లు కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. తెలుగు, క‌న్న‌డలో రూపొందుతోన్న  బైలింగ్వ‌ల్ ఫిలిం ఇది. ల‌వ్, ఎమోష‌న్, కామెడీ, యాక్ష‌న్ ఇలా అన్ని రకాల క‌మ‌ర్షియ‌ల్ అంశాలతో ఈ సినిమాను తెర‌కెక్కించాం. మా టీం అందరి సమిష్టి కృషి వల్లే సినిమా చేయగలిగాను``అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్ః ఎ.వెంక‌ట్; ఎడిట‌ర్ః వెంకీ యుడివి;  ఫైట్స్ః  థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మాద‌;  కొరియోగ్రాఫ‌ర్ః న‌గేష్‌.వి;  లిరిక్స్ః శ్రీమ‌ణి, సాహితి, అర్మాన్‌;  నిర్మాత‌లుః రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి; ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వంః అశ్విన్ కృష్ణ‌.