ర్యాలీలకు నో పర్మిషన్

శుక్రవారం చేపట్టే మహిళల పాదయాత్రకు ఎలాంటి అనుమతి లేదంటూ గుంటూరు ఎస్పీ విజయరావు తెలిపారు. ఉద్దండరాయునిపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు జేఎసీ ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌తో పాటుగా.. సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుమతి లేని ర్యాలీలో ఎవరు పాల్గొన్నా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.