రాష్ట్రంలో దుశ్శాసన పర్వం నడుస్తోంది

గత తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందిలేకుండా రాష్ట్రంలో పాలన సాగిందని, వైసీపీప్రభుత్వం వచ్చాక మహిళలను రక్తమొచ్చేలా కొట్టడం, హీనంగా ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేసినరోజు నిజంగా బ్లాక్‌డేనే అని టీడీపీ మహిళానేత, మాజీ ఎమ్మెల్యే అనిత తెలిపారు. శనివారం ఆమె ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుడి, బడులదగ్గర 144సెక్షన్‌ పెట్టడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామని, తమకు న్యాయంచేయాలంటూ విజయవాడ వీధుల్లోకి వచ్చిన ఆడబిడ్డలను మగాళ్లతో అడ్డుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు.

మహిళా కానిస్టేబుళ్లనే వినియోగించామని చెబుతున్న ఎస్పీ, అబద్ధాలతో ప్రజల్ని నమించలేరని. సాధారణ పోలీసులతో పాటు, CRF వారు కూడా మహిళల నడుములు పట్టుకొని, ఈడ్చుకెళుతున్న చిత్రాలను, ఈ సందర్భంగా అనిత విలేకరులకు ప్రదర్శించారు. ఇటుకలు పట్టుకొని ఉగ్రవాదుల్ని తరిమినట్లుగా మహిళల్ని తరిమికొట్టడమేనా శాంతిభద్రతలు కాపాడటం అని ఆమె ప్రశ్నించారు.

మందడం సహా, మిగిలిన గ్రామాలన్నింటిలో, విజయవాడలో పౌరులకన్నా పోలీసులే ఎక్కువగా ఉన్నారని, వీధుల్లో ఖాకీల విన్యాసాలుచూస్తుంటే, అమరావతి నిర్వీర్యానికి ఈ ముఖ్య మంత్రి ఎంతలా తపిస్తున్నాడో అర్థమవుతోందన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచడా నికి చివరకు, నిర్బంధించిన మహిళల్ని కులాలు అడిగే దుస్థితికి ప్రభుత్వం దిగజారింద న్నారు.

పోలీస్‌స్టేషన్‌ నుంచి విడిచిపెట్టడానికి, వారికులానికి సంబంధమేంటన్నారు. సాయంత్రం 6దాటిన తర్వాత కూడా స్త్రీలను పోలీస్‌స్టేషన్లలో ఉంచారని, ఇంత జరుగుతుంటే రాష్ట్ర మహిళాకమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ఏం చేస్తోందని, గత ఐదేళ్లనుంచి పెయిడ్‌ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఆమె, ఇప్పుడుకూడా ప్రభుత్వ జీతంతీసుకుంటూ, పెయిడ్‌ ఆర్టిస్ట్‌ మాదిరే మాట్లాడుతోందన్నారు.

పచ్చకామెర్ల వచ్చిన వారికి అందరూ పచ్చగా కనిపించినట్లుగా ఛైర్‌పర్సన్‌కు జీవితాలకోసం పోరాడే అమరావతి మహిళలు, వారికి మద్ధతుగా నిలిచిన మేథావులు, వైద్యులు, విద్యార్థులు కూడా పెయిడ్‌ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు న పడిన మహిళలగురించి మాట్లాడలేని ఛైర్‌పర్సన్‌ తన పదవికి రాజీనామాచేసి ఇంట్లో కూర్చోవాలన్నారు.

హోంమంత్రిగా మహిళే ఉన్నారని, ఆమెఆదేశాలు, డీజీపీ ఆర్డర్స్‌వల్లే పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు విజయవాడలో మహిళార్యాలీకి అనుమతిలేదన్న పోలీసులే, విశాఖలో మంత్రి అవంతికి రక్షణగా నిలిచారని, విశాఖలో ఒకన్యాయం, విజయవాడలో మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైసీపీవాళ్లు జెండాకోసం పనిచేస్తుంటే, తాము ఎజెండా కోసం పనిచేస్తున్నా మన్నారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతూ మాట్లాడుతున్నవారంతా, తమకు తల్లో, చెల్లో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు.

రాష్ట్రంలో దుశ్శాసనపర్వం నడుస్తోందని, బూటుకాళ్లకింద ఆడవాళ్లను తొక్కడమేంటని, తమతల్లిని, చెల్లిని అలాగే తొక్కుతూ ఈడ్చుకెళుతుంటే ఎవరైనా ఊరుకుంటారా అని అనిత నిలదీశారు. విజయవాడలో జరిగిన దాష్టీకంపై న్యాయపోరాటం చేస్తామని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదుచేస్తామని అనిత స్పష్టంచేశారు. డీజీపీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని, ర్యాలీలోని ఆడబిడ్డలపట్ల క్రూరంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌చేశారు. రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు న్యాయంచేస్తుందన్న నమ్మకం తమకులేదని,

రాష్ట్రం రావణ కాష్టంలా మారినవేళ, హైపవర్‌కమిటీ సమావేశాలు నిర్వహించడం విచిత్రంగా ఉంద న్నారు. తాను వేసిన కమిటీలు, తాను చెప్పిందే నివేదికలరూపంలో చెబుతుంటే, వాటిగురించి తిరిగి చర్చించడమేంటని, ఎవర్ని మభ్యపెట్టడానికని అనిత ప్రశ్నించారు.