కడప, పులివెందులకు నిధుల ప్రవాహం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల, కడప నియోజకవర్గాలకు నిధుల ప్రవాహం కొనసాగుతోంది. వారం, పది రోజులుగా గమనిస్తే రూ.1200 నుంచి రూ.1500ల విలువ జేసే పనులకు సంబంధించి పాలనాపరమైన ఉత్తర్వులతో పాటు నిధుల విడుదలకు ఏకంగా 30 జీవోలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి విడుదల చేయనంత స్థాయిలో ఒక్క పులివెందులకే నిధులు కేటాయించడం రాజకీయవర్గాల్లో చర్చకు తెరలేపింది. ఏడు నెలల కాలంలోనే ఇంత పెద్ద మొత్తం ఆ రెండు నియోజకవర్గాలకు కేటాయించడం వెనుక ఆంతర్యమేమై ఉంటుందని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులంటూ ఓ వైపు ప్రకటించి ప్రజల దృష్టినంతా అటువైపు మళ్లించిన సిఎం నిధులను తన సొంత నియోజకవర్గానికి అత్యధికంగా కేటాయించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే తేటతెల్లం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. -జీవో MS నెంబరు -146: కడప మెడికల్‌ కాలేజీలో సూపర్‌ స్పెషాల్టీ బ్లాక్‌ కోసం రూ.125కోట్లు కేటాయింపు. - జీవో MS నెంబరు-145 కడపలో 100 పడకల మెంటల్‌ హాస్పిటల్‌ కోసం రూ.40.82 కోట్లు కేటాయింపు - జీవో MS నెంబరు -144: కడపలో ఎల్‌వి ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి అనుమతి - జీవో MS నెంబరు -142: పులివెందులలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కోసం రూ.347కోట్లు కేటాయింపు. - జీవో MS నెంబరు -140: కడపలో 100 పడకలతో వైఎస్‌ఆర్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఏర్పాటు. - జీవో ఆర్‌టి నెంబరు -1077: కడపలో స్టేట్‌ ప్లాన్‌ ద్వారా రూ.20.95 కోట్లతో 5బిల్డింగ్‌ల నిర్మాణం. - జీవో ఆర్‌టి నెెంబరు -235: కడపలో ఫ్రీ మెట్రిక్‌ పోస్ట్‌ హాస్టల్‌ నిర్మాణం కోసం రూ.5.20 కోట్లు. - జీవో నెంబరు ఆర్‌టి-755: కడపలో రాజీవ్‌ మార్గ్‌ రోడ్‌ నిర్మాణం కోసం రూ.3.85కోట్లు - జీవో నెంబరు ఆర్‌టి -396:పులివెందులకు అండర్‌గ్రౌండ్‌, డ్రైనేజీ కోసం రూ.63 కోట్లు కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి -743: కడపలో రూరల్‌ వాటర్‌ సప్ల్తె కింద రూ.1,315లక్షల కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి- 337 కడప జిల్లాకు కొత్త ఉర్దూ జూనియర్‌ కళాశాల కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి 573: పులివెందులలో ఇరిగేషన్‌ పనులకు రూ.182.69లక్షల కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి -572 పులివెందులలోని ఇరిగేషన్‌ పనులకు రూ.146.93లక్షలు కేటాయింపు. - జీవో ఆర్‌టి నెంబరు:-574 పులివెందులలోని వేంపల్లె దగ్గర మూడు పనులకు రూ.46.93లక్షలు కేటాయింపు. - జీవో ఆర్‌టి నెంబరు 563: కడపలోని తుమ్మల చెరువు అభివృద్ధి కోసం రూ.41.02లక్షల కేటాయింపు. - జీవో ఆర్‌టి నెంబరు -569: కడపలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువ ఆధునీకరణ కోసం రూ.15 కోట్లు. - జీవో ఆర్‌టి నెంబరు -570 కడపలోని జెర్రికొన రిజర్వాయర్‌ నుంచి నీళ్లు ఎత్తిపోసే ప్రాజెక్టు కోసం రూ.19లక్షలు. - జీవో ఆర్‌టి నెంబరు-359: పులివెందులలో స్టోర్స్‌ కాంప్లెక్స్‌ కోసం రూ.17.50 కోట్లు కేటాయింపు. - జీవో ఎంఎస్‌ నెంబరు-44: వైఎస్‌ఆర్‌ ఉద్యాన వన విశ్వవిద్యాలయం, అరటి పరిశోధన కేంద్రం కోసం పులివెందులలో 70.03 ఎకరాలు కేటాయింపుల కోసం. - జీవో నెంబరు ఆర్‌టి -210: పులివెందులలో జెఎన్‌టియు -ఎ కాలేజీలో కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి-753: పులివెందుల మునిసిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.100కోట్లు కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి -392: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి బడ్జెట్‌లో రూ.29 కోట్లు కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి -754: పులివెందులకు వాటర్‌ సప్ల్తె కోసం రూ.65కోట్లు కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి-571: కడప జిల్లాలో రాయచోటి మునిసిపాలిటీకి రూ.340.60కోట్ల నిధులు విడుదల. - జీవో నెంబరు ఆర్‌టి-335: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల మరమ్మతుల కోసం రూ.20.13లక్షలు విడుదల. - జీవో ఎంఎస్‌ నెంబరు -84: గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టిఎంసి నీళ్లు కడప జిల్లాలో పెట్టబోయో ఉక్కు కర్మాగారానికి కేటాయింపు. 1000 గేలెన్ల నీళ్లు రూ.5.50 రూపాయల చొప్పున కేటాయింపు. - జీవో నెంబరు ఆర్‌టి-756: కడపలో బ్యూటిఫికేషన్‌ కోసం రూ.55 కోట్లు విడుదల.