పవన్ కు బీజేపీ బంపరాఫర్..

ఏపీలో బీజేపీ..జనసేన మధ్య పొత్తు అధికారికంగా ఖరారైంది. ఇక..ఏపీలో బలం పెంచుకొనే దిశగా రెండు పార్టీలు ప్రాధమకంగా ఒక అంచనాకు వచ్చాయి. తక్షణం అమరావతి అంశం మీద ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఇక, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తరువాత ఏపీలో కీలక నిర్ణయాలు ఉంటాయని బీజేపీ నేతలు పవన్ కు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా..జనసేన అధినేతకు బీజేపీ పెద్దలు బంపరాఫర్ ప్రతిపాదించారు. అయితే, పవన్ మాత్రం ఆచి తూచి స్పందిస్తున్నారు. గతంలో జరిగిన రాజకీయాల కారణంగా పవన్ ఆ ఆఫర్ పైన ఆలోచన చేస్తున్నారు. పవన్ కు ఆ ఆఫర్ ఇవ్వటం ద్వారా రాజకీయంగా ఉపయోగం ఉంటుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు.ఏపీలో జనసేన..బీజేపీ పొత్తు ఖరారు సమయంలోనే కొన్ని హామీలు..నిర్ణయాలు జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా.. ముందుగా ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ బలోపేతం కావాలంటే రెండు పార్టీల కు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ ప్రతిపాదించింది. అందులో భాగంగా..పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి..రాజ్యసభకు పంపాలనేది ఆరెస్సెస్ ..బీజేపీ నేతల ప్రతిపాదన చర్చకు వచ్చిన ట్లు విశ్వసనీయ సమాచారం. మోడీ ప్రస్తుత కేబినెట్ లో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. దీంతో..ఇప్పుడు పవన్ కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి..ఆయన ద్వారా కేంద్ర పధకాలు..కేంద్రం నుండి ఏపికి అందించిన..అం దుతున్న సాయం పైన ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. దీని ద్వారా సీఎం జగన్ కు చెక్ పెట్టే వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ వద్ద చర్చ జరగ్గా.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం కీలక బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని.. ఎన్నికలయ్యే వరకూ రెండు పార్టీల బలోపేతం బాధ్యత రెండు పార్టీల నేతలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారంఅయితే, జనసేన అధినేత మాత్రం తనకు కేంద్ర మంత్రి పదవి ప్రతిపాదన పైన వెంటనే అంగీకారం తెలపలేదని సమాచారం. తనకు పదవులు అవసరం లేదని..ఏపీకి కేంద్ర మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. ఏపీలో జనసేనకు ఒక్క ఎంపీ స్థానం కూడా లేదు. బీజేపీకి సైతం రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే, అందులో ముగ్గురు టీడీపీ నుండి వచ్చినవారే. వారిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగినా..అందుకు బీజేపీ సిద్దంగా లేదనే విషయం తాజా సమీకరణాల ద్వారా స్పష్టమవుతోంది. దీంతో.. సురేష్ ప్రభు ప్రస్తుతం ఏపీ కోటాలనే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక, జనసేనాని మాత్రం ఆ ప్రతిపాదనకు అంగీకారం చెప్పటానికి వెంటనే సంసిద్దత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ప్రజారాజ్యం..తరువాత జరిగిన పరిణామాలతో ఆయన ఈ బాధ్యతల స్వీకరణ పట్ల ఆలోచన లో పడినట్లుగా చెబుతున్నారు. అయితే, ఇంకా సమయం ఉండటంతో..పవన్ కు పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారాజ్యం విలీనం తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చిరంజీవి రాజ్యసభ సభ్యుడయ్యారు. యుపీఏ-2 లో ఆయన మన్మోహన్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేసారు. 2014 ఎన్నికల వరకు ఆయన మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు తిరిగి అదే విధంగా కేంద్ర మంత్రి హోదా దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని మీద పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత మాత్రమే నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక, నేరుగా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించి..రెండు పార్టీలకు మేలు చేసేలా ఎక్కువగా ప్రజల్లోనే ఉండే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. దీని ద్వారా బీజేపీలో జరుగుతున్న చర్చలు కార్యరూపం దాలిస్తే..త్వరలోనే పవన్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.