జనసేన బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా

ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు ఖరారైన తరువాత ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రెండు పార్టీలు ఢిల్లీ కేంద్రంగా నిర్ణయించిన తొలి కార్యక్రమే వాయిదా పడటం పైన ఇప్పుడు ఆ సక్తి కర చర్చ సాగుతోంది. దీనికి కారణాలను మాత్రం రెండు పార్టీలు ప్రకటించలేదు. ఇదే సమయంలో ఏపీలో మండలి రద్దు ప్రతిపాదనల పైనా రెండు పార్టీలు ఇప్పటి వరకు స్పందించలేదు. సోమవారం దీని పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది.అయితే, లాంగ్ మార్చ్ వాయిదా పడటం వెనుక అసలు కారణం ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్..అయితే, లాంగ్ మార్చ్ వాయిదా పడటం వెనుక అసలు కారణం ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్..బీజేపీ..జనసేన అమరావతి నుంచి రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే కారణాలను మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో రెండు పార్టీల ముఖ్యనేతలు తమ మధ్య పొత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని..మూడు రాజధానులకు వ్యతిరేకమని రెండు పార్టీల నేతలు స్పష్టం చేసారు. ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బీజేపీ కలిసే చేస్తాయని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉండటానికి.. బీజేపీ- జనసేన కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.పొత్తు తరువాత రెండు పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడటానికి అసలు కారణం ఏంటనే దాని పైన స్పష్టత ఇవ్వేలేదు. ప్రస్తుతం రాజధాని తరలింపు బిల్లు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించటంతో నిర్ణయం అమలు కొంత ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెర మీదకు మండలి రద్దు ప్రతిపాదన వచ్చింది. మండలిలో జనసేనకు ప్రాతినిధ్యం లేకపోయినా..బీజేపీకి మాత్రం ఇద్దరు సభ్యులు ఉన్నారు. రెండు పార్టీల నేతలు దీని పైన స్పందించటం లేదు. ఇక, శాసనసభలో ఆమోదించిన బిల్లుల పైన రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించగా .. ఆ కేసులను వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత.. ప్రస్తుతానికి కవాతు వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీని పైన రెండు పార్టీల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతున్నారు.