ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీతో ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్కడ ఇతర రాష్ట్రాల ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తెలుగు వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారానికి పవన్ ను దించాలని కమలనాధులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన అధినేతతో చర్చలు మొదలయ్యాయి. వచ్చే వారంలో పవన్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ రోజు అధికారికంగా దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, పవన్ సమర్ధతకు ఇప్పుడు ఇది మరింత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పవన్ ఏ మేర ప్రభావం చూపించగలుగుతారనేది ఆసక్తి కరంగా కనిపిస్తోంది.ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో..ప్రతీ సీటు మీద బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ సారి ఢిల్లీ పీఠం దక్కుంచుకొనేందుకు ఏ ఒక్క అవకాశం జార విడుచోకూడదని నిర్ణయించింది. అందులో భాగంగా..ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు ఢిల్లీలో గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఇక, దేశ రాజధానిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో స్థిర పడటంతో..వారిని ఆకర్షించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇక, ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధు ల గెలుపు ఓటములను తెలుగు వారే ప్రభావితం చేయనున్నారు. దీంతో,..అక్కడ తెలుగు ప్రజలను ఆకట్టుకొనేందుకు ఏపీ బీజేపీ నేతలతో పాటుగా జనసేన అధినేతను సైతం ఎన్నికల ప్రచారంలోకి దించాలని బీజీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ జనసేన అధినేతతో చర్చలు జరిపారు. పవన్ సైతం తను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరునున్నారు. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు రోడ్ షోలకు ప్రణాళికలు సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో..పాటు కరోల్ బాగ్ ప్రాంతంలో బహిరంగ సభ సైతం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బీజేపీ తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటుగా పవన్ సైతం ప్రచారం చేయనున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ తెలుగు రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల గెలుపు ఆ పార్టీకి ఎంత అవసరమో..పవన్ కళ్యాణ్ కు సైతం అంతే ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పవన్ ఏ స్థాయిలో ప్రభావితం చూపించగలరనే చర్చ మొదలైంది. పవన్ పర్యటించే ప్రాంతాల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారితే..బీజేపీ అధినాయకత్వం వద్ద పవన్ ఇమేజ్ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.