పింఛన్లు కావాలా..? దరఖాస్తు చేసుకోండి

నిన్నటి నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్డు వాలంటీర్లు స్వయంగా లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. దీనిపై పింఛన్‌దారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల 65వేల మందికి పింఛన్లను అందించారు. గడప దగ్గరకే పెన్షన్లను చేర్చాలన్న సంకల్పం సాకారం చేసిన అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు.

అవినీతి, వివక్ష లేకుండా లబ్దిదారులకు ఇంటి వద్దనే పెన్షన్‌ ఇస్తుంటే.. వారి కళ్లలో కనిపించిన సంతోషం తన బాధ్యతను మరింతగా పెంచిందని సీఎం అన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇదంతా సాధ్యమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నామన్న ఆయన ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేస్తారన్నారు.